సచివాలయ సేవల్లో జిల్లాకు తృతీయ స్థానం

ABN , First Publish Date - 2020-10-13T09:47:48+05:30 IST

గ్రామ, వార్డు సచివాలయ సేవల్లో జిల్లా రాష్ట్రస్థాయిలో తృతీయస్థానంలో నిలిచినట్లు జేసీ వీరబ్రహ్మం తెలిపారు.

సచివాలయ సేవల్లో జిల్లాకు తృతీయ స్థానం

చిత్తూరు కలెక్టరేట్‌, అక్టోబరు 12: గ్రామ, వార్డు సచివాలయ సేవల్లో జిల్లా రాష్ట్రస్థాయిలో తృతీయస్థానంలో నిలిచినట్లు జేసీ వీరబ్రహ్మం తెలిపారు. సోమవారం జడ్పీ మీటింగ్‌హాలులో డిజిటల్‌ అసిస్టెంట్లకు రెండురోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. జేసీ మాట్లాడుతూ... సచివాలయాల ద్వారా 543 సేవలు అందుతున్నట్లు గుర్తుచేశారు. మండలానికో మీసేవ కేంద్రం ఉండగా, ఇందులో క్వాలిఫైడ్‌ ఉద్యోగులు లేరన్నారు. సేవల విషయంలో డిజిటల్‌ అసిస్టెంట్లు అలసత్వం వహించడం తగదన్నారు. ప్రస్తుత శిక్షణానంతరం సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. జడ్పీ ఇన్‌చార్జి సీఈవో ప్రభాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-13T09:47:48+05:30 IST