-
-
Home » Andhra Pradesh » Chittoor » tpt news
-
జిల్లాలో పార్టీని బలోపేతం చేయండి
ABN , First Publish Date - 2020-10-07T11:28:44+05:30 IST
జిల్లాలో పార్టీని బలోపేతం చేసి మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు అందరూ కృషి చేయాలని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.

టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు
చిత్తూరు అర్బన్, అక్టోబరు 6: జిల్లాలో పార్టీని బలోపేతం చేసి మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు అందరూ కృషి చేయాలని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన రాష్ట్రంలో పార్టీకి చెందిన అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. జిల్లాలో పార్లమెంట్ స్థాయి, అనుబంధ విభాగాల కమిటీల ను వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు.
అమరావతి రైతుల దీక్షలు ఈనెల 12వతేదీకి 300 రోజులు పూర్తవుతున్న దృష్ట్యా, అన్ని పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాల్లో ఈ దీక్షలకు సంఘీభావం తెలపాలన్నారు. కాన్ఫరెన్స్‌లో టీడీపీ చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్షులు పులివర్తి నాని, నరసింహ యాదవ్ పాల్గొన్నారు.