గుంతకల్లు రైల్వే ఎస్పీగా తిరుపతి ఏఎస్పీ అనిల్‌బాబు

ABN , First Publish Date - 2020-10-07T11:27:29+05:30 IST

తిరుపతి శాంతి భద్రతల విభాగం ఏఎస్పీగా పనిచేస్తున్న అనిల్‌బాబు నాన్‌ క్యాడర్‌ ఎస్పీగా పదోన్నతి పొందారు. ఐదు నెలలక్రితమే అనిల్‌బాబుకు ఎస్పీగా పదోన్నతి లభించింది.

గుంతకల్లు రైల్వే ఎస్పీగా తిరుపతి ఏఎస్పీ అనిల్‌బాబు

తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 6: తిరుపతి శాంతి భద్రతల విభాగం ఏఎస్పీగా పనిచేస్తున్న అనిల్‌బాబు నాన్‌ క్యాడర్‌ ఎస్పీగా పదోన్నతి పొందారు. ఐదు నెలలక్రితమే అనిల్‌బాబుకు ఎస్పీగా పదోన్నతి లభించింది. ఇలా నాన్‌క్యాడర్‌ ఎస్పీలుగా పదోన్నతులు పొందినవారికి రాష్ట్ర ప్రభుత్వం స్థానాలు కల్పించకపోవడంతో ఇప్పటి వరకు ఆయన పోస్టింగ్‌ కోసం ఎదురు చూశారు. మంగళవారం ఆయన్ను గుంతకల్లు రైల్వే ఎస్పీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

Read more