ప్రజల అపోహలు తొలగించండి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-09-29T12:13:22+05:30 IST

ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకంపై ప్రజల్లోని అపోహలను తొలగించాలని కలెక్టర్‌ భరత్‌గుప్తా సూచించారు.

ప్రజల అపోహలు తొలగించండి : కలెక్టర్‌

ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకంపై ప్రజల్లోని అపోహలను తొలగించాలని కలెక్టర్‌ భరత్‌గుప్తా సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాలులో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అధ్యక్షతన జిల్లా విద్యుత్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్‌ మాట్లాడుతూ.. విద్యుత్‌ కనెన్షన్ల కోసం ఇదివరకే ప్రజల నుంచి అందిన 11వేల దరఖాస్తులను తొలి ప్రాధాన్యంగా క్లియర్‌ చేయాలన్నారు.


మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్‌ బాషా మాట్లాడుతూ.. అన్ని ఫీడర్ల ద్వారా చిన్న ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజా ప్రతినిధులకు విద్యుత్‌ ఉన్నతాధికారులు సహకరించడం లేదని అసహనం వ్యక్తంచేశారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. లైన్‌మెన్లతో త్వరలో వీడియో కాన్ఫరెన్స్‌ జరపాలని కలెక్టర్‌కు సూచించారు. అలాగే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేల అధ్యక్షతన అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.


ప్రజా ప్రతినిధుల సందేహాలను విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ డి.వెంకటాచలపతి నివృత్తి చేశారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ యండపల్లె శ్రీనివాసులు, ఉపాధి హామీ స్టేట్‌ కౌన్సిల్‌ సభ్యుడు ముత్యంశెట్టి విశ్వనాథ్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-29T12:13:22+05:30 IST