త్వరలో అంతర్రాష్ట్ర పర్యాటక ప్యాకేజీలు
ABN , First Publish Date - 2020-09-14T09:54:19+05:30 IST
తిరుపతి నుంచి త్వరలో అంతర్రాష్ట్ర పర్యాటకశాఖ ప్యాకేజీలు ప్రారంభించనున్నట్లు టూరిజం తిరుపతి డీవీఎం సురేష్‌కుమార్‌రెడ్డి ..
కోవిడ్ బాధితులకు టూరిజం సేవలు
తిరుపతి డీవీఎం సురేష్‌కుమార్‌రెడ్డి
బి.కొత్తకోట, సెప్టెంబరు 13: తిరుపతి నుంచి త్వరలో అంతర్రాష్ట్ర పర్యాటకశాఖ ప్యాకేజీలు ప్రారంభించనున్నట్లు టూరిజం తిరుపతి డీవీఎం సురేష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన హార్సిలీహిల్స్‌లో మీడియాతో మాట్లాడుతూ కరోనాతో పర్యాటకశాఖ కుదేలు అయిందని, ప్రస్తుతం ఆ పరిస్థితి నుంచి తమ సంస్థ కుదుట పడుతోందన్నారు.
తిరుపతిలో కరోనా బాధితులకు భోజన వసతి టీటీడీతోపాటు రెవెన్యూ అధికారులు కల్పిస్తుండగా తమ సిబ్బంది వంటలు వండి ప్యాకింగ్ చేసి వాటిని కోవిడ్ కేంద్రాలకు సరఫరా చేస్తున్నందుకు ఒక్కో బాధితుడికి రూ.65చొప్పున సేవా రుసుం పొందుతున్నామని చెప్పారు. గత నెల సేవా రుసుం కింద రూ.20లక్షలు ఆదాయం వచ్చిందన్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్ ఎత్తివేసిన నేపథ్యంలో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు అంతర్రాష్ట్ర ప్యాకేజీలను తిరుపతి పర్యాటక శాఖ ప్రారంభించేందుకు చర్యలు తీసుకొంటున్నట్లు ఆయన తెలిపారు. హార్సిలీహిల్స్‌లోనూ పర్యాటకుల సంఖ్య పెరుగుతుండడంతో గత మాసం సుమారు రూ.15లక్షలు ఆదాయం లభించిందని ఆయన చెప్పారు. ఆయన వెంట మేనేజర్ సాల్విన్‌రెడ్డి వున్నారు.