తిరుపతిలో బోల్తా పడ్డ లారీ... తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2020-10-21T18:41:59+05:30 IST

రేణిగుంట సమీపంలో బుధవారం ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. కాగా లారీ డ్రైవర్, క్లీనర్‌కు స్వల్పగాయాలు అవడంతో పెను ప్రమాదం తప్పింది.

తిరుపతిలో బోల్తా పడ్డ లారీ... తప్పిన ప్రమాదం

తిరుపతి: రేణిగుంట సమీపంలో బుధవారం ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. కాగా లారీ డ్రైవర్, క్లీనర్‌కు స్వల్పగాయాలు అవడంతో పెను ప్రమాదం తప్పింది. లారీ చెన్నై నుంచి కర్నూలుకు వెళ్తుండగా... రేణిగుంట సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలిసిన వెంటనే గాజులమండ్యం పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు యత్నిస్తున్నారు. 

Updated Date - 2020-10-21T18:41:59+05:30 IST