జగన్‌కు కులం, మతం, పార్టీ లేదు: నారాయణస్వామి
ABN , First Publish Date - 2020-11-13T17:17:06+05:30 IST
ఎన్టీఆర్ మండల వ్యవస్థను బలోపేతం చేస్తే... జగన్ గ్రామ స్వరాజ్యని తీసుకొస్తున్నారని వైసీపీ నేత నారాయణస్వామి అన్నారు.
తిరుమల: ఎన్టీఆర్ మండల వ్యవస్థను బలోపేతం చేస్తే... జగన్ గ్రామ స్వరాజ్యని తీసుకొస్తున్నారని వైసీపీ నేత నారాయణస్వామి అన్నారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా మార్చేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని తెలిపారు. జగన్‌కు కులం, మతం, పార్టీ లేదని...వెంకటేశ్వరస్వామి, అల్లా, యేసు ఆశీస్సులు జగన్‌కు పుష్కళంగా ఉన్నాయని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు దళితులను ఇబ్బంది పెట్టి... ఇప్పుడు దళితులపై చంద్రబాబు ప్రేమ కురిపిస్తున్నారని మండిపడ్డారు. దళితులకు పెద్ద పీఠ వేసి వారి అభివృద్ధికి సీఎం జగన్ పాటుపడుతున్నారని తెలిపారు. 56 కార్పొరేషన్‌లను ఏర్పాటు చేసి బీసీలకు పెద్ద పీఠ వేశారన్నారు. ప్రజలంతా వైసీపీ వెంటే ఉన్నారని అన్నారు. తిరుపతి లోకసభ నియోజకవర్గాన్ని వైసీపీ కైవసం చేసుకుంటుందని నారాయణస్వామి ధీమా వ్యక్తం చేశారు.