తిరుమలలో విరిగిపడ్డ కొండచరియలు
ABN , First Publish Date - 2020-11-26T12:35:28+05:30 IST
తిరుమలలోని కనుమ దారిలో కొండచరియలు విరిగిపడ్డారు. రెండో కనుమ దారి హరిణి ప్రాంతంలో బండరాళ్లు విరిగిపడ్డాయి.

తిరుమల: తిరుమలలోని కనుమ దారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. రెండో కనుమ దారి హరిణి ప్రాంతంలో బండరాళ్లు విరిగిపడ్డాయి. 14వ కిలో మీటర్ దగ్గర భక్తులు వెళ్తున్న కారుపై బండరాళ్లు విరిగిపడ్డాయి. కాగా కారులో ప్రయాణిస్తున్న భక్తులు సురక్షితంగా బయటపడ్డారు. బండరాళ్లు పడటంతో కారు ముందుభాగం ధ్వంసమైంది. సమాచారం అందిన వెంటనే అధికారులు అక్కడకు చేరుకుని జేసీబీల సాయంతో బండరాళ్లను తొలగిస్తున్నారు.