ఆర్థిక ఇబ్బందులున్నా పరిశ్రమలకు బకాయిలు చెల్లించాం: బాలసుబ్రహ్మణ్యం
ABN , First Publish Date - 2020-10-19T19:17:21+05:30 IST
లాక్‌డౌన్ అనంతరం రాష్ట్రంలో ఇప్పటికే 90శాతం పరిశ్రమలు తెర్చుకున్నాయని... త్వరలోనే 10 శాతం పరిశ్రమలు కూడా తెర్చుకుంటాయని ఆశిస్తున్నామని పరశ్రమల శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.

తిరుమల: లాక్‌డౌన్ అనంతరం రాష్ట్రంలో ఇప్పటికే 90 శాతం పరిశ్రమలు తెర్చుకున్నాయని... త్వరలోనే 10 శాతం పరిశ్రమలు కూడా తెర్చుకుంటాయని ఆశిస్తున్నామని పరశ్రమల శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గత ఐదు ఏళ్ళుగా పరిశ్రమలకు బకాయిలుగా ఉన్న రూ.950 కోట్ల ప్రోత్సహాకాలను చెల్లించామని చెప్పారు. రాయలసీమ జిల్లాలో జరుగుతున్న పలు ఇండస్ట్రియల్ కారిడార్ పనులపై సమీక్ష నిర్వహించామని చెప్పారు. పనులు శరవేగంగా జరుగుతున్నాయని బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.