పొలం వద్ద మహిళ ఒంటరిగా కనపడడంతో.. ఓ వ్యక్తి ఆమెపై..
ABN , First Publish Date - 2020-07-27T15:02:48+05:30 IST
ఓ మహిళపై అత్యాచారయత్నం చేసిన యువకుడిని పోలీసులు..

చిత్తూరు(ఆంధ్రజ్యోతి): ఓ మహిళపై అత్యాచారయత్నం చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు తాలూకా ఎస్ఐ నాగసౌజన్య కథనం మేరకు.. చిత్తూరు మండలం తిమ్మసానిపల్లెకు చెందిన ఓ మహిళ శనివారం గ్రామ సమీపంలోని పొలం వద్దకు బయలుదేరారు. ఇదే గ్రామానికి చెందిన పార్తీబన్(24) గమనించి ఆమెపై అత్యాచారయత్నం చేయగా తప్పించుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆదివారం యువకుడిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ నాగసౌజన్య పేర్కొన్నారు.