రీసెర్చ్ స్కాలర్లకు గడువు పొడిగింపు
ABN , First Publish Date - 2020-12-05T06:58:59+05:30 IST
యూనివర్సిటీల్లో ఎంఫిల్, పీహెచ్డీ కోర్సులు చేస్తున్న రీసెర్చ్ స్కాలర్లకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొంత వెసులుబాటు కల్పించింది.

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), డిసెంబరు 4: యూనివర్సిటీల్లో ఎంఫిల్, పీహెచ్డీ కోర్సులు చేస్తున్న రీసెర్చ్ స్కాలర్లకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొంత వెసులుబాటు కల్పించింది. థీసిస్, డిజర్టేషన్లను ఆయా యూనివర్సిటీలకు సమర్పించేందుకు ఈ నెలాఖరుకు ముగియనున్న గడువును మరో ఆరు నెలల పాటు పొడిగించింది. కొవిడ్ నేపథ్యంలో ఈ నిర్ణయ తీసుకున్నారు. యూజీసీ సెక్రటరీ ప్రొఫెసర్ రజనీష్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. కొవిడ్ పరిస్థితుల్లో రీసెర్చ్ స్కాలర్లకు ఇలాంటి వెసులుబాటు కల్పించడం పట్ల అఖిల భారతీయ రాష్ట్రీయ శిక్షక్ మహా సంఘ్ రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ వైవీ రామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.