ఫిబ్రవరి కోటా కందిపప్పుకు నగదు కట్టండి
ABN , First Publish Date - 2020-12-29T07:05:20+05:30 IST
చౌకదుకాణాల డీలర్లకు జనవరి కోటా కందిపుప్పును అప్పుపై ప్రభుత్వం సరఫరా చేసింది. ఫిబ్రవరి కోటాకు మాత్రం నగదు కట్టాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈసారి డీలర్లకు అప్పుపై ఇచ్చేది లేదన్న ప్రభుత్వం
చిత్తూరు (సెంట్రల్), డిసెంబరు 28: చౌకదుకాణాల డీలర్లకు జనవరి కోటా కందిపుప్పును అప్పుపై ప్రభుత్వం సరఫరా చేసింది. ఫిబ్రవరి కోటాకు మాత్రం నగదు కట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే తమకు 12 నెలల కమీషన్ డబ్బులు రాకపోగా, కందిపప్పుకు ముందుగా నగదు చెల్లించమనడం చెప్పడం భారమవుతుందని డీలర్లు చెబుతున్నారు. ఈ లెక్కన ఫిబ్రవరి కోటా కందిపప్పును ఎంతమేరకు సరఫరా చేస్తారో వేచి చూడాల్సి ఉంది.