పట్టుబడింది మూడు పాలకంటైనర్లు

ABN , First Publish Date - 2020-08-18T09:20:31+05:30 IST

పశుమాంసం అక్రమంగా తరలిస్తూ పట్టబడింది ఒకటి కాదు.. మూడు పాలకంటైనర్లు. ఇవి పలమనేరులోని ఎస్‌కేఎస్‌ కంపెనీకి చెందినవి. ఈనెల 8న ఒడిశాలో రాష్ట్రం జనాపూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఒకటి పట్టుబడిన విషయం విదితమే. అదే రోజు

పట్టుబడింది మూడు పాలకంటైనర్లు

పలమనేరు, ఆగస్టు 17: పశుమాంసం అక్రమంగా తరలిస్తూ పట్టబడింది ఒకటి కాదు.. మూడు పాలకంటైనర్లు. ఇవి పలమనేరులోని ఎస్‌కేఎస్‌ కంపెనీకి చెందినవి. ఈనెల 8న ఒడిశాలో రాష్ట్రం జనాపూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఒకటి పట్టుబడిన విషయం విదితమే. అదే రోజు విశాఖజిల్లా పెందుర్తి పోలీసులు ఎపి03, టీసీ 0666, ఎపి03 టీజే 0729 నంబరుగల రెండు పాలకంటైనర్లను పట్టుకొన్నారు. ఈ రెండు పాల కంటైనర్లను అక్కడి కోర్టు ఈ నెల 13 వతేదీన విడుదల చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. కాగా, పశుమాంస అక్రమ రవాణాకు పాల్పడితే బెయిలబుల్‌ కేసులే కావడం, జరిమానాలతో శిక్షలు ముగుస్తాయని పోలీసులు అంటున్నారు.


పట్టుబడిన మాంసం ఆవుదా లేక గేదెదా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. పాల కంటైనర్లలో పెద్ద ఎత్తున పశుమాసం తరలిస్తున్నారంటే.. దీని వెనుక ఇంకొ కొందరి సహకారం ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాల కంటైనర్ల కాంట్రాక్టును డెయిరీ యాజమాన్యం రద్దు చేయాలని టీడీపీ నాయకులు గిరిబాబు, సుబ్రహ్మణ్యం గౌడు, నాగరాజు, ఆర్బీసీ కుట్టి, ఖాజా, బ్రహ్మయ్య, కోటీశ్వర్లు తదితరులు డిమాండు చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారుతూ ధనార్జనే ధ్యేయంగా ప్రజారోగ్యానికి భంగం కలిగించే చర్యలకు పాల్పడే వారిని ఆయా పార్టీల నుంచి వెలివేయాలన్నారు. 

Updated Date - 2020-08-18T09:20:31+05:30 IST