జిల్లాకు ముగ్గురు రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు

ABN , First Publish Date - 2020-08-16T09:50:32+05:30 IST

జిల్లా ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీసుశాఖకు ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు(ఆర్‌ఐ) బదిలీపై వస్తుండగా, మరో ఇద్దరు ఇతర జిల్లాలకు బదిలీ అయ్యారు. దీనికి సం

జిల్లాకు ముగ్గురు రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు

చిత్తూరు, ఆగస్టు 15: జిల్లా ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీసుశాఖకు ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు(ఆర్‌ఐ) బదిలీపై వస్తుండగా, మరో ఇద్దరు ఇతర జిల్లాలకు బదిలీ అయ్యారు. దీనికి సంబంధించి శనివారం రాత్రి ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు.. కడపలో రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న జావెద్‌ను చిత్తూరుకు, తిరుపతి ఆర్‌ఐ మురళీధర్‌ను చిత్తూరుకు, ఇక్కడ సీఐడీ విభాగంలో పనిచేస్తున్న బాబును చిత్తూరుకు బదిలీ చేశారు.


ఇక చిత్తూరులో ఆర్‌ఐగా పనిచేస్తున్న మధును కడప జిల్లాకు బదిలీ చేశారు. దీంతోపాటు చిత్తూరులో రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న శ్రీనివాసులును అమరావతి హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేసుకోవాలని ఉన్నతాధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - 2020-08-16T09:50:32+05:30 IST