టీటీడీ జేఈవో బంగ్లాలో చోరీ

ABN , First Publish Date - 2020-05-24T17:43:24+05:30 IST

టీటీడీ జేఈవో బసంత్‌కుమార్‌ బంగ్లాలో చోరీ జరిగింది. సుమారు రూ.6.30 లక్షల విలువైన బంగారు

టీటీడీ జేఈవో బంగ్లాలో చోరీ

  • రూ. 6.30 లక్షల సొత్తు అపహరణ


తిరుపతి : టీటీడీ జేఈవో బసంత్‌కుమార్‌ బంగ్లాలో చోరీ జరిగింది. సుమారు రూ.6.30 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను అపహరించుకెళ్లారు. రోజులాగానే శుక్రవారం రాత్రి కూడా జేఈవో కుటుంబీకులు నిద్రపోయారు. శనివారం లేచేసరికి బంగ్లా వెనుక ప్రాంతంలో మెష్‌ కత్తిరించి ఉంది. కుటుంబీకులకు అనుమానం వచ్చి బీరువా తెరవగా.. అందులోని నగలు కనిపించలేదు. దాంతో వారు ఎస్వీయూ పోలీసులకు సమాచారం ఇచ్చారు.


సీఐ రవీంద్రనాథ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని, క్లూస్‌టీమ్‌ను రప్పించారు. సీసీ ఫుటేజీలను పరిశీలించారు. కుటుంబీకులంతా ఓ గదిలో నిద్రించగా.. మరో గదిలో బీరువా ఉన్నట్లు సమాచారం. జేఈవో ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశారు. రూ.6.30 లక్షల విలువైన 18 తులాల బంగారు, ఐదు తులాల వెండి ఆభరణాలు చోరీ జరిగినట్లు సీఐ వెల్లడించారు. ఈ కేసును తిరుపతి క్రైమ్‌ పోలీసులకు అప్పగించారు. కాగా.. సాయంత్రం అర్బన్‌ జిల్లా ఎస్పీ రమేష్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Updated Date - 2020-05-24T17:43:24+05:30 IST