భౌతికదూరం మరిచారు

ABN , First Publish Date - 2020-07-14T11:08:34+05:30 IST

వర్షాలు కురుస్తూ ఉండడంతో కలుపు తొలగించడంలో మండలంలోని వేరుశనగ రైతులు మునిగారు.

భౌతికదూరం మరిచారు

మదనపల్లె టౌన్‌, జూలై 13: వర్షాలు కురుస్తూ ఉండడంతో కలుపు తొలగించడంలో మండలంలోని వేరుశనగ రైతులు మునిగారు. మొక్కలు ఎదిగే సమయం కావడంతో కలుపు నివారణ మందుల కోసం ఎరువుల దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. మాస్కులు ధరించకుండా, భౌతికదూరం మరచి క్యూ కడుతున్నారు. సోమవారం మదనపల్లె పట్టణం మల్లికార్జున సర్కిల్‌ వద్ద ఉన్న ఎరువుల దుకాణం వద్ద ఇలా పెద్దసంఖ్యలో రైతులు గుమిగూడారు. అయితే అధికశాతం మాస్కులు ధరించక పోవడాన్ని అధికారులు సీరియ్‌సగా తీసుకోక పోవడం సమస్యగా మారింది. 

Updated Date - 2020-07-14T11:08:34+05:30 IST