అంబులెన్సు కోసం నిరీక్షించి... నిరీక్షించి!

ABN , First Publish Date - 2020-07-22T11:33:36+05:30 IST

అధికారుల నిర్లక్ష్యం ఓ వృదుఽ్ధడి పాలిట శాపంగా మారింది. అంబులెన్సు కోసం 15గంటలకు పైగా నిరీక్షించిన చివరకు

అంబులెన్సు కోసం నిరీక్షించి... నిరీక్షించి!

తుదిశ్వాస విడిచిన వృద్ధుడు


శ్రీకాళహస్తి, జూలై 21: అధికారుల నిర్లక్ష్యం ఓ వృదుఽ్ధడి పాలిట శాపంగా మారింది. అంబులెన్సు కోసం 15గంటలకు పైగా నిరీక్షించిన చివరకు  తుదిశ్వాస విడిచాడు.శ్రీకాళహస్తిలోని రాజీవ్‌నగర్‌కు చెందిన ఒక వృద్ధుడు (75) ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో 14వ తేదీన కరోనా పరీక్షలు చేయించారు.ఆయనకు కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయిందని సోమవారం మధ్యాహ్నం సెల్‌ఫోన్‌కు మెసేజి వచ్చింది.శ్రీకాళహస్తి వైద్య సిబ్బంది బాధితుడి కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి ఆయన్ను ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్సును అరగంటలో పంపుతామని... అవసరమైన సామగ్రిని సర్దుకుని సిద్ధంగా ఉండాలని చెప్పారు.వారు చెప్పినట్లు అన్నీ సర్దుకుని ఆస్పత్రికి వెళ్లడానికి సదరు వృద్ధుడు సిద్ధమయ్యాడు.


గంటలు గడిచి పోతున్నా... అంబులెన్సు రాలేదు. దీంతో వృద్ధుడి కుటుంబ సభ్యులు పలు పర్యాయాలు ఆ ప్రాంత వలంటీరుకు, వైద్య సిబ్బందికి ఫోన్‌ చేశారు. అదిగో ఇదిగో అంటూ కాలం వెళ్లబుచ్చారు తప్ప రాత్రయినా అంబులెన్సు రాలేదు. వేరే వాహనం ద్వారా అతన్ని తిరుపతికి తరలిద్దామనుకున్నా కరోనా భయంతో ఎవరూ ముందుకు రాలేదు. అర్ధరాత్రి దాటిపోయింది. కరోనా సోకిన వృద్ధుడికి శ్వాస తీసుకోవడంలో సమస్య జటిలమైంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు మళ్లీ వైద్య సిబ్బందికి తెలియచేశారు. అంబులెన్సు పంపితే ఆస్పత్రికి తరలించి వృదుఽ్ధడి ప్రాణాలు కాపాడుకోవచ్చని వేడుకున్నారు. అయి నా అంబులైన్సు రానేలేదు. కరోనా పరీక్ష ఫలితం ఏడు రోజులకు రావడం... వచ్చినా సకాలంలో ఆస్పత్రికి తరలించడం ఆలస్యం కావడంతో ఆ వృదుఽ్ధడి పరిస్థితి విషమించింది.


సుమారు 15గంటల పాటు అంబులెన్సు కోసం నిరీక్షించి... మంగళవారం వేకువ జామున 3.30 గంటల సమయంలో ఇంటి వద్దే తుదిశ్వాస విడిచాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకాళహస్తి పురపాలక సంఘ కమిషనరు శ్రీకాంత్‌ పారిశుధ్య కార్మికులను అక్కడకు పంపారు. మధ్యాహ్నం 12గంటల తరువాత శవాన్ని ఒక వాహనం ద్వారా పట్టణం లోని సున్నపు హరిజనవాడ సమీపంలో గల ఓ శ్మశాన వాటికలో పూడ్చిపెట్టారు.అయితే స్థానికులు వ్యతిరేకించడం తో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసు  బందోబస్తు మధ్య శవాన్ని పూడ్చాల్సి వచ్చింది.


కాగా అధికారుల నిర్లక్ష్యం పట్ల మృతుని కుటుంబీకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నిర్లక్ష్యమే వృద్ధుని ప్రాణాలు తీసిందని వారు ఆరోపిస్తున్నారు. తాము పేదవారం కాబట్టే ఇలా చేశారని... అదే డబ్బు ఉన్పా... పలుకుబడి ఉన్నా ఇలా జరిగేదని కాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-07-22T11:33:36+05:30 IST