అజ్మీర్ కేసులు సహా పాజిటివ్‌ల సంఖ్య 187
ABN , First Publish Date - 2020-05-17T10:56:28+05:30 IST
జిల్లాలో మరో ఏడు కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.తాజా కేసులు కలుపుకుంటే జిల్లాలో కోయంబేడు

తిరుపతి, మే 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరో ఏడు కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.తాజా కేసులు కలుపుకుంటే జిల్లాలో కోయంబేడు మూలాలతో నమోదైన కేసుల సంఖ్య 73కు చేరగా మొత్తం కేసుల సంఖ్య 176కు పెరిగింది. ఇక అజ్మీర్ కేసులు 11కూడా కలిపి లెక్కిస్తే జిల్లాకు సంబంధించిన కరోనా వైరస్ కేసులు 187గా తేలాయి.వీరిలో 78మంది కోలుకుని ఆస్పత్రులనుంచి డిశ్చార్జి అయ్యారు.క్వారంటైన్ కేంద్రాల్లో 451మంది అనుమానితులు అబ్జర్వేష న్‌లో వున్నారు.శనివారం 129మంది క్వారంటైన్ కేంద్రాలనుంచి డిశ్చార్జి అయ్యారు.