సచివాలయం కోసం గడ్డివాముల ధ్వంసం
ABN , First Publish Date - 2020-04-25T10:29:48+05:30 IST
ఏర్పేడు మండలం చెల్లూరులో సచివాలయ నిర్మాణం కోసం రైతులు వేసుకున్న గడ్డివాములను శుక్రవారం ధ్వంసం

ఏర్పేడు, ఏప్రిల్ 24: ఏర్పేడు మండలం చెల్లూరులో సచివాలయ నిర్మాణం కోసం రైతులు వేసుకున్న గడ్డివాములను శుక్రవారం ధ్వంసం చేయడం వివాదం రేపింది.చెల్లూరులో గ్రామానికి దూరంగా ఉండే ప్రభుత్వ స్థలంలో సచివాలయం నిర్మించాలని కొంతమంది వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు.ఇందుకోసం దశాబ్దాలుగా ముగ్గురు రైతుల స్వాధీనంలో ఉండిన స్థలంలో వేసిన గడ్డివాములను శుక్రవారం ఎక్సకవేటరు సాయంతో తొలగించే ప్రయత్నం చేశారు.గడ్డివాములను తొలగించవద్దంటూ అడ్డం వెళ్లిన తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని బాధిత రైతులు గోవిందయ్య, భాస్కరయ్య, ఈశ్వరరెడ్డి, సుబ్రహ్మణ్యం వాపోయారు.అధికారులు జోక్యం చేసుకుని ఈ స్థలాలను వదిలిపెట్టి చెల్లూరు బస్టాపు వద్ద ఉన్న ప్రభుత్వ స్థలంలో సచివాలయం నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.