టెన్త్‌ పరీక్షలు మరోసారి వాయిదా

ABN , First Publish Date - 2020-03-25T10:52:25+05:30 IST

కరోనా వైరస్‌ అరికట్టడంలో భాగంగా ఈనెల 31 నుంచి జరగాల్సిన టెన్త్‌ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది.

టెన్త్‌ పరీక్షలు మరోసారి వాయిదా

చిత్తూరు సెంట్రల్‌, మార్చి 24: కరోనా వైరస్‌ అరికట్టడంలో భాగంగా ఈనెల 31 నుంచి జరగాల్సిన టెన్త్‌ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈనెల 23న జరగాల్సిన పరీక్షలు 31కి వాయుదా పడగా కరోనా తీవ్రత తగ్గకపోవడంతో మంగళవారం మరోసారి వాయిదా వేశారు. తదుపరి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనేది తర్వాత ప్రకటిస్తారు. పరీక్షలు వాయిదా పడినా ప్రశ్నాపత్రాలు ఈనెల 26 నుంచి నాలుగు దశల్లో జిల్లాకు రానున్నాయి. వీటిని గుర్తించిన 74 పోలీసు స్టేషన్లకు తరలించి భద్రపరుస్తారు.. ఓఎంఆర్‌ షీట్లు కూడా మంగళవారం జిల్లాకు చేరాయి. డీఈవో కార్యాలయంలోనూ ఉద్యోగులు మంగళవారం నుంచి షిఫ్ట్‌ సిస్టమ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల 31 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. 

Read more