మార్చి 31 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు
ABN , First Publish Date - 2020-03-08T13:40:23+05:30 IST
ఈనెల 23 నుంచి జరగాల్సిన టెన్త్ పబ్లిక్ పరీక్షలను స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా 31కి మార్పు చేస్తూ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ శనివారం

- స్థానిక ఎన్నికల నేపధ్యంలో తేదీల మార్పు
చిత్తూరు సెంట్రల్: ఈనెల 23 నుంచి జరగాల్సిన టెన్త్ పబ్లిక్ పరీక్షలను స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా 31కి మార్పు చేస్తూ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మర్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతి రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 వరకు పరీక్షలు ఉంటాయి. మార్పు చేసిన పరీక్షల షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 31న తెలుగు పేపర్-1, ఏప్రిల్ 1న తెలుగు పేపర్-2, 3న హిందీ (సెకండ్ లాంగ్వేజ్), 4న ఇంగ్లీష్ పేపర్-1, 6న ఇంగ్లీష్ పేపర్-2, 7న మ్యాథమెటిక్స్ పేపర్-1, 8న మ్యాథమెటిక్స్ పేపర్-2, 9న జనరల్ సైన్స్ పేపర్-1, 11న జనరల్ సైన్స్ పేపర్-2, 13న సోషల్ స్టడీస్ పేపర్-1, 15న సోషల్ స్టడీస్ పేపర్-2, 16న ఓఎస్‌ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2, 17న ఎస్‌ఎస్‌సీ ఓకేషనల్ కోర్స్ (థియరీ) పరీక్షలు జరగనున్నాయి.