ఆర్టీసీ డిపోల్లో షాపుల నిర్వహణకు టెండర్లు

ABN , First Publish Date - 2020-12-31T04:43:09+05:30 IST

తిరుపతి రీజియన్‌ పరిధిలోని ఆర్టీసీ డిపోలలో షాపుల నిర్వహణకు టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు ఆర్‌ఎం చెంగల్‌రెడ్డి బుధవారం తెలిపారు.

ఆర్టీసీ డిపోల్లో షాపుల నిర్వహణకు టెండర్లు

తిరుపతి(రవాణా), డిసెంబరు 30: తిరుపతి రీజియన్‌ పరిధిలోని ఆర్టీసీ డిపోలలో షాపుల నిర్వహణకు టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు ఆర్‌ఎం చెంగల్‌రెడ్డి బుధవారం తెలిపారు. చిత్తూరు డివిజన్‌ పరిధిలో చిత్తూరు, మదనపల్లె, పలమనేరు, పీలేరు, కుప్పం తదితర ప్రాంతాల్లోని 274 దుకాణాలకు.. తిరుపతి డివిజన్‌ పరిధిలో తిరుపతి, పుత్తూరు, శ్రీకాళహస్తి, సత్యవేడు తదితర ప్రాంతాల డిపోల వద్ద 167 దుకాణాలకు టెండర్లు పిలుస్తున్నామన్నారు. చిత్తూరు డివిజన్‌కు సంబంధించి జనవరి 7న.. తిరుపతి డివిజన్‌లో 8మధ్యాహ్నం ఒంటి గంట వరకు  గడువు ఉందన్నారు. అదే రోజుల్లో టెండర్లను తెరుస్తామన్నారు ఆయా డిపో మేనేజర్ల కార్యాలయాల్లో దరఖాస్తులు లభిస్తాయన్నారు. 

Updated Date - 2020-12-31T04:43:09+05:30 IST