-
-
Home » Andhra Pradesh » Chittoor » tavanapallem chittoor
-
భార్యతో గొడవ.. బిడ్డకు విషమిచ్చి తల్లితో కలసి..
ABN , First Publish Date - 2020-12-30T18:16:46+05:30 IST
భార్యతో గొడవపడ్డ ఓ వ్యక్తి తల్లితో..

తవణంపల్లె(చిత్తూరు): భార్యతో గొడవపడ్డ ఓ వ్యక్తి తల్లితో కలసి విషం తాగి మూడేళ్ల కొడుకుకు కూడా విషమిచ్చిన సంఘటన మంగళవారం తవణంపల్లె మండలంలో జరిగింది. నారసింహనపల్లెకు చెందిన మునెప్ప కుమారుడు గిరివాసులు(30) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి బంగారుపాళ్యం మండలం దండువారిపల్లెకు చెందిన అపర్ణ(25)తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. అపర్ణ భర్త వేరు కాపురం పెట్టలేదని అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఇంటికి తిరిగి రావాలని గిరివాసులు భార్యను పిలవగా ఆమె రానని చెప్పడంతో మనస్తాపం చెందాడు. గిరివాసులు అతడి తల్లి పద్మ(57) ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారిద్దరూ విషం తాగి మూడేళ్ల బిడ్డకు కూడా ఇచ్చారు. ఇది గమనించిన బంధువులు, గ్రామస్తులు వెంటనే వారిని వేలూరు సీఎంసీకి తరలించగా చికిత్స అనంతరం ముగ్గురు కోలుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు.