భౌతికదూరం పాటించకుంటే చర్యలు చేపట్టండి

ABN , First Publish Date - 2020-04-07T11:59:59+05:30 IST

ప్రజలంద రూ తమ తమ దేవుళ్లను ఇళ్లల్లోనే ప్రార్థించుకోవా లని డిప్యూటీ సీఎం నారాయణస్వామి కోరారు.

భౌతికదూరం పాటించకుంటే చర్యలు చేపట్టండి

తిరుపతి, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): ప్రజలంద రూ తమ తమ దేవుళ్లను ఇళ్లల్లోనే ప్రార్థించుకోవా లని డిప్యూటీ సీఎం నారాయణస్వామి కోరారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో సోమవారం జరిగిన కోవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌ రెండో సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నూలు పరిస్థితి నేపథ్యంలోనైనా ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల న్నారు. మైనారిటీ సోదరులు ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బయట నుంచి వచ్చే వారు ఆగిన ఈ సమయంలో పక్క వారికి వైరస్‌ సోకే ప్రమాదం ఉన్నందున అప్ర మత్తంగా ఉండాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పేర్కొన్నారు.


భౌతికదూరం పాటించని వారిపై కఠినంగా వ్యవహరించాలని, అలాంటి షాపులనూ సీజ్‌ చేయాలని ఆదేశించారు. మూడు గంటల్లో 90 నమూనాలు రిజల్ట్‌ చేయడానికి వీలుండే టెస్టింగ్‌ ఆటోమేటిక్‌ మిషన్‌ గురించి స్విమ్స్‌ డైరెక్టర్‌ వెంగ మ్మ ప్రస్తావించగా.. దాని కొనుగోలును పరిశీలిం చాలని కలెక్టర్‌కు మంత్రి సూచించారు. నియోజ కవర్గ టాస్క్‌ఫోర్స్‌ సమావేశాలు జరిపి.. వారి సూచనలనూ జిల్లా కమిటీ తీసుకోవాలన్నారు. అక్కడి ఇబ్బందులు, అవసరాలపై ఎమ్మెల్యేలు దృష్టి సారించాలన్నారు. డాక్టర్లు, సిబ్బంది ఇబ్బంది పడకుండా పీపీఈలు, ఎన్‌95 మాస్క్‌లు అందించా లన్నారు. ధాన్యం కొనుగోళ్లు.. టమోటా, దోసకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలన్నారు. నిత్యా వసర వస్తువుల ధరలు అదుపులో ఉంచాలన్నారు. పాజిటివ్‌ వచ్చిన 17 మందిని తిరుపతిలో ఐసొలేషన్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్‌ భరత్‌ గుప్తా వెల్లడించారు. వీరిలో ఢిల్లీ జమాత్‌ వెళ్లిన వారు 14 మంది ఉన్నారన్నారు.


వారి కుటుంబీకుల్లో చాలామందికి నెగెటివ్‌ వచ్చినందు న క్వారంటైన్‌లో ఉంచామని వివరించారు. పద్మావతి కోవిడ్‌-19 ఆస్పత్రిలో పాజిటివ్‌ కేసుల అడ్మి షన్‌ జరుగుతోందని, రుయాలోని ఓపీ కూడా అక్కడికే మారుస్తామ న్నారు. సీఎం సహాయ నిధికి రూ.5.5 కోట్ల వరకు చెక్కులు అందాయన్నారు. ఇప్పటికే కొనుగోలు చేసిన ప్రత్యేక అంబులెన్సులను లాక్‌డౌన్‌ తర్వాత ఇవ్వనున్నామన్నారు. కోవిడ్‌-19 ఆస్పత్రిలో 40 వెంటిలేటర్లు, 150 పడకలు సిద్ధంగా ఉన్నాయని డాక్టర్‌ వెంగమ్మ తెలిపారు. ఇప్పటివరకు వెంటిలేటర్ల అవసరం రాలేదన్నారు. స్విమ్స్‌ క్వాలిటీ కంట్రోల్‌ ల్యాబ్‌గా కేంద్రం గుర్తించినందున రాష్ట్రంతో పాటు తెలంగాణ నుంచీ రోజూ 20 వరకు నమూనాల ఫైనల్‌ రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం కేసులు చూస్తున్నా మని వివరించారు. కోవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ రాష్ట్ర పరిశీలకుడు సిసోడియా, ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యే ఆదిమూలం, తిరుపతి కమిషనరు పీఎస్‌ గిరీష, జేసీ మార్కండేయులు, జేసీ-2 చంద్రమౌళి, మెంబర్‌, కన్వీనర్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఆఫీసర్‌ పెంచలయ్య, చిత్తూరు, అర్బన్‌ ఎస్పీలు సెంథిల్‌కుమార్‌, రమేష్‌రెడ్డి, హాస్పిటల్‌ సర్వీసెస్‌ జిల్లా సమన్వయకర్త పాండురంగయ్య, ఎస్వీ మెడికల్‌కాలేజీ ప్రిన్సిపాల్‌ జయభాస్కర్‌, డీటీసీ బసిరెడ్డి, జిల్లా సరఫరా అధికారి విజయరాణి, డీపీవో సాంబశివారెడ్డి, డీఈవో నరసింహారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ మురళి, ఆర్టీసీ ఆర్‌ఎం చెంగల్‌రెడ్డి, ఆర్డీవో కనకనరసారెడ్డి, డీసీహెచ్‌ఎస్‌ సరళమ్మ, కోవిడ్‌ ఆసుపత్రి నోడల్‌ అధికారి చంద్రశేఖర్‌, అధికారులు పాల్గొన్నారు. సత్యవేడు నియోజకవర్గ దాతల నుంచి సేకరించిన రూ.15,60,216 చెక్కులను సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కోసం ఎమ్మెల్యే ఆదిమూలం అందించారు. 


Read more