స్వర్ణముఖి నది పరిరక్షణ కోసం గ్రామ కమిటీల ఏర్పాటు

ABN , First Publish Date - 2020-07-15T10:12:14+05:30 IST

ఏర్పేడు మండలంలో ప్రవహిస్తున్న స్వర్ణముఖి నది పరిరక్షణ కోసం రైతులు కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు.

స్వర్ణముఖి నది పరిరక్షణ కోసం  గ్రామ కమిటీల ఏర్పాటు

ఏర్పేడు, జూలై 14: ఏర్పేడు మండలంలో ప్రవహిస్తున్న స్వర్ణముఖి నది పరిరక్షణ కోసం  రైతులు కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రధానంగా కొత్తవీరాపురం, మోదుగులపాళెం నుంచి గ్రామ కమిటీల్లో సభ్యులను చేర్చారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి సంక్రాంతి వెంకటయ్య మాట్లాడుతూ... ఏర్పేడు ప్రాంతంలోని స్వర్ణముఖి నదిలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందన్నారు. దాన్ని అరికట్టేందుకే నది సమీపంలో ఉన్న గ్రామాలలో కమిటీలను ఏర్పాటు చేశామన్నారు.


అధికారులు ఇసుక అక్రమ రవాణాను అరికట్టకపోతే గ్రామకమిటీల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామన్నారు. నిబంధనల మేరకు అడుగునుంచి మూడు అడుగులలోతు వరకే ఇసుక తవ్వాల్సి ఉండగా ఉండగా 10 నుంచి 20 అడుగుల వరకు  తోడేస్తున్నారని చెప్పారు. అనంతరం కమిటీను ఎన్నుకున్నారు. కొత్తవీరాపురం గ్రామకమిటీ కన్వీనర్లుగా సుబ్రహ్మణ్యం, గిరి, రంగయ్య, సభ్యులుగా చెంగల్రాయులు, జయరామయ్య, ధనమ్మ, రాజయ్య, మోదుగులపాళెం  గ్రామకమిటీ కన్వీనర్లుగా పంచాక్షరి, నాగరాజు, సుబ్రహ్మణ్యం, సభ్యులుగా బాబు, గోపిని ఎన్నుకున్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు రామిశెట్టి వెంకయ్య, గౌరవాధ్యక్షుడు వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-15T10:12:14+05:30 IST