‘గోల్డెన్‌ ఏజ్‌’ ర్యాంకింగ్స్‌లో ఎస్వీయూకు 8వ స్థానం

ABN , First Publish Date - 2020-06-25T11:25:54+05:30 IST

‘ద యంగ్‌ యూనివర్సిటీ’ ర్యాంకింగ్స్‌లో ఎస్వీయూ ప్రపంచ స్థాయిలో 101- 150 మధ్య ర్యాంకు, దేశంలో 8వ ర్యాంకు

‘గోల్డెన్‌ ఏజ్‌’ ర్యాంకింగ్స్‌లో ఎస్వీయూకు 8వ స్థానం

ప్రపంచ స్థాయిలో 101-150 మధ్య ర్యాంకు 


తిరుపతి (విశ్వవిద్యాలయాలు), జూన్‌ 24: ‘ద యంగ్‌ యూనివర్సిటీ’ ర్యాంకింగ్స్‌లో ఎస్వీయూ ప్రపంచ స్థాయిలో 101- 150 మధ్య ర్యాంకు, దేశంలో 8వ ర్యాంకు  పొందింది. వర్సిటీలో బోధన, పరిశోధన, విస్తరణ రంగాల్లో జరిగిన కృషికి గుర్తింపుగా ఈ ర్యాంక్‌ లభించింది. 1945-67 మధ్య ఏర్పాటై 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న 151 దేశాల్లోని 308 గోల్డెన్‌ ఏజ్‌ యూనివర్సిటీలను ‘టైమ్స్‌’ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ పరిశీలించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు ఎస్వీయూ అధికార యంత్రాంగానికి సమాచారం పంపారు. సంస్థ వెబ్‌సైట్‌లోనూ ఈ సమాచారాన్ని పొందుపరిచారు. ఆ నివేదిక ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్వీయూ మొదటి స్థానాన్ని పొందింది. వర్సిటీ ఉన్నత గుర్తింపును పొందడం పట్ల రెక్టార్‌ సుందరవల్లి, రిజిస్ట్రార్‌ శ్రీధర్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.  

Updated Date - 2020-06-25T11:25:54+05:30 IST