చేనేత కార్మికుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-09-01T09:46:21+05:30 IST
నా చావుకు ఎవరూ కారణం కాదు’ అని సూసైడ్‌నోట్ రాసి ఓ చేనేత కార్మికుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన మదన

మదనపల్లె క్రైం, ఆగస్టు 31: ‘నా చావుకు ఎవరూ కారణం కాదు’ అని సూసైడ్‌నోట్ రాసి ఓ చేనేత కార్మికుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన మదనపల్లె మండలంలో జరిగింది. తాలూకా పోలీసుల కథనం మేరకు..కోళ్లబైలు పంచాయతీ జగన్‌కాలనీకి చెందిన వెంకట్రమణ కుమారుడు కె.ప్రసాద్(24) ఇటీవల మద్యానికి బానిసై మగ్గం పనులు మానేసి స్నేహితులతో కలసి తిరుగుతున్నాడు.
ఇంటికి కూడా రావడం లేదు. కాగా యువకుడు కాలనీకి సమీపంలోని చెట్టుకు ఉరేసుకోగా సోమవారం ఉదయం స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సూసైడ్‌నోట్ స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.