సీఎం కాన్వాయ్‌ ట్రయల్‌ రన్‌ సక్సెస్‌

ABN , First Publish Date - 2020-12-28T05:29:41+05:30 IST

ఏర్పేడు మండలం ఊరందూరుకు సోమవారం ముఖ్యమంత్రి జగన్‌ రానున్న సందర్భంగా తిరుపతి అర్బన్‌ ఎస్పీ రమేష్‌రెడ్డి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇందులో భాగంగా తిరుపతి విమానాశ్రయం నుంచి ఏర్పేడు మీదుగా ఊరందూరు వరకు ఎస్పీ ఆధ్వర్యంలో కాన్వాయ్‌ ట్రయల్‌ రన్‌ విజయవంతంగా నిర్వహించారు.

సీఎం కాన్వాయ్‌ ట్రయల్‌ రన్‌ సక్సెస్‌
ఊరందూరులో బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎస్పీ రమేష్‌రెడ్డి

తిరుపతి (నేరవిభాగం)/రేణిగుంట, డిసెంబరు 27: ఏర్పేడు మండలం ఊరందూరుకు సోమవారం ముఖ్యమంత్రి జగన్‌ రానున్న సందర్భంగా తిరుపతి అర్బన్‌ ఎస్పీ రమేష్‌రెడ్డి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇందులో భాగంగా తిరుపతి విమానాశ్రయం నుంచి ఏర్పేడు మీదుగా ఊరందూరు వరకు ఎస్పీ ఆధ్వర్యంలో కాన్వాయ్‌ ట్రయల్‌ రన్‌ విజయవంతంగా నిర్వహించారు. అలాగే సీఎం పర్యటించే మార్గాల్లో బాంబ్‌, డాగ్‌ స్క్వాడ్‌లతో తనిఖీలు చేస్తున్నారు. ట్రాఫిక్‌ అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే బందోబస్తు కోసం అదనపు ఎస్పీలు ముగ్గురు, డీఎస్పీలు తొమ్మిది మంది, సీఐలు 18 మంది, ఎస్‌ఐలు 42 మంది, ఏఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుళ్లు 109 మంది, కానిస్టేబుళ్లు 215 మంది, ఉమెన్‌ పోలీస్‌ 34 మంది, హోంగార్డ్స్‌ 140మంది, స్పెషల్‌ పార్టీ 5 (50) మొత్తం 739 మందిని నియమించినట్లు ఎస్పీ వివరించారు.  

Updated Date - 2020-12-28T05:29:41+05:30 IST