బ్లాక్‌మెయిల్ రాజకీయాలు మానుకోండి
ABN , First Publish Date - 2020-12-30T05:00:27+05:30 IST
ప్రతిపక్షాలు చేసే విమర్శల్లోని సానుకూల అంశాలను తీసుకుని సమస్యలను పరిష్కరించకుండా బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేయడం అధికార పార్టీకి తగదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మంగళవారం ఒక ప్రకటనలో హితవు
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
పుత్తూరు, డిసెంబరు 29: ప్రతిపక్షాలు చేసే విమర్శల్లోని సానుకూల అంశాలను తీసుకుని సమస్యలను పరిష్కరించకుండా బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేయడం అధికార పార్టీకి తగదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మంగళవారం ఒక ప్రకటనలో హితవు పలికారు. జగన్ భవనాల్లో కుక్కలకు కేటాయించే స్థలం కంటే తక్కువ స్థలాన్ని పేదలకు ఇచ్చి ప్రచార ఆర్భాటం చేయడం తగదని తాను సహేతుక విమర్శ చేసింది వాస్తవమేనన్నారు. తన విమర్శలో తక్కువ స్థలం అంశం తీసుకుని పేదలకు న్యాయం చేయకుండా ఉపమానానికి పెడార్థాలు తీసి కులం రంగు పూసి బ్లాక్ మెయిల్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. గతంతో వైఎస్‌కు మద్దతు పలికినప్పుడు కనబడని కులం నేడు కన్పించిందా అని వైసీపీని ప్రశ్నించారు. అవకాశవాదంతో పార్టీలు మారకుండా సిద్ధాంత రాజకీయాలు చేస్తున్నానని నారాయణ అన్నారు.