మూలపల్లెకు కర్రల వంతెన

ABN , First Publish Date - 2020-12-10T05:33:55+05:30 IST

చంద్రగిరి మండలం మూలపల్లె గ్రామంలోని డ్యామ్‌ కొట్టుకుపోయింది. ఆ గ్రామస్థులు డ్యామ్‌ద్వారా కాలువను దాటి వెళ్లేవారు. దీంతో స్థానికులు ప్రత్యామ్నాయంగా కర్రలతో తాత్కాలికంగా వంతెన ఏర్పాటు చేసుకున్నారు.

మూలపల్లెకు కర్రల వంతెన
మూలపల్లె వద్ద కర్రల వంతెనపై నడుస్తున్న వైద్య సిబ్బంది

గ్రామస్థుల తాత్కాలిక ఏర్పాటు 


చంద్రగిరి, డిసెంబరు 9: చంద్రగిరి మండలం మూలపల్లె గ్రామంలోని డ్యామ్‌ కొట్టుకుపోయింది. ఆ గ్రామస్థులు డ్యామ్‌ద్వారా కాలువను దాటి వెళ్లేవారు. దీంతో స్థానికులు ప్రత్యామ్నాయంగా కర్రలతో తాత్కాలికంగా వంతెన ఏర్పాటు చేసుకున్నారు. ఇక, పుల్లయ్యగారిపల్లె వద్ద భీమానదిలో వరద నీరు జోరుగా ప్రవహిస్తుండటంతో వంతెనకు రక్షణగా ఉన్న ప్రహరీ గోడ బుధవారం కూలిపోయింది. ఈ ప్రహరీపైనే బందార్లపల్లె పంచాయతీలోని వినాయకనగర్‌కు వెళ్లేవారు. ఇది కూలిపోవడంతో ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. 

Updated Date - 2020-12-10T05:33:55+05:30 IST