ఇద్దరు వైద్యులకు రాష్ట్రస్థాయి అవార్డులు
ABN , First Publish Date - 2020-08-16T09:49:11+05:30 IST
తిరుపతిలోని రుయా, మెటర్నటీ ఆస్పత్రుల్లో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ భారతి

తిరుపతి (వైద్యం), ఆగస్టు 15: తిరుపతిలోని రుయా, మెటర్నటీ ఆస్పత్రుల్లో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ భారతిని రాష్ట్ర ఉత్తమ గైనకాలజిస్ట్ అవార్డు వరించింది. అలాగే శ్రీనివాసం కొవిడ్ కేర్ సెంటర్‌లో మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పి.శ్రీనివాసరావు.. రాష్ట్ర ఉత్తమ కొవిడ్ వైద్యుడిగా అవార్డుకు ఎంపికయ్యారు.
వీరిద్దరికీ శనివారం విజయవాడలో జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఈ అవార్డులు, ప్రశంసాపత్రాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి ప్రదానం చేశారు.