శ్రీవారి సేవలో శ్రీలంకాధీశుడు

ABN , First Publish Date - 2020-02-12T10:51:27+05:30 IST

శ్రీలంక ప్రఽధాని మహింద రాజపక్సే మంగళవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

శ్రీవారి సేవలో శ్రీలంకాధీశుడు

 గంట 40 నిమిషాలు ఆలయంలో గడిపిన రాజపక్సే


తిరుమల, ఫిబ్రవరి 11: శ్రీలంక ప్రఽధాని మహింద రాజపక్సే మంగళవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సోమవారం రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయన మంగళవారం ఉదయం 5.30 గంటలకు మహద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లారు. అష్టదళ పాదపద్మారాధనసేవలో పాటు వీఐపీ బ్రేక్‌లోనూ శ్రీవారిని దర్శించుకున్నారు. రాజపక్సేతో పాటు ఆయన కుమారుడు యోషిత రాజపక్సే కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.


దర్శనం తర్వాత రంగనాయక మండపంలో టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో ధర్మారెడ్డి వారికి లడ్డూప్రసాదాలు అందజేశారు. 7.10 గంటలకు ఆలయం వెలుపలికి వచ్చి పద్మావతి అతిథిగృహానికి చేరుకున్నారు. భద్రతాదళాల గౌరవ వందన స్వీకార అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. ప్రతిసారి సుప్రభాత సేవలో పాల్గొనే రాజపక్సే ఈసారి ఉదయం అష్టదళం, వీఐపీ బ్రేక్‌లో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుగు ప్రయాణమైన ఆయనకు తిరుపతి విమానాశ్రయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి, జిల్లా అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. 

Updated Date - 2020-02-12T10:51:27+05:30 IST