శ్రీకాళహస్తిలో రెండు చెరువులకు గండి
ABN , First Publish Date - 2020-11-26T18:02:04+05:30 IST
నివర్ తుపాన్ ప్రభావంతో శ్రీకాళహస్తిలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.

తిరుపతి: నివర్ తుపాన్ ప్రభావంతో శ్రీకాళహస్తిలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో శ్రీకాళహస్తి మండలంలో రెండు చెరువులకు గండి పడింది. చింతల, యార్లపూడిలో చెరువులకు గండి పడటంతో అనేక పంట పొలాలు నీట మునిగాయి. మరోవైపు తిరుమల వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురుస్తోంది. బలమైన గాలులు వీచడంతో చెట్లు విరిగిపడుతున్నాయి. పాపవినాశనం దారిపై కూలిన వృక్షాలను అటవీ సిబ్బంది తొలగించారు.