శ్రీకాళహస్తి టౌన్‌ బ్యాంకు అధ్యక్షుడిగా శెట్టిపల్లె సురేష్‌బాబు

ABN , First Publish Date - 2020-07-28T16:11:55+05:30 IST

శ్రీకాళహస్తి టౌన్‌ బ్యాంకుకు కొత్త పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు..

శ్రీకాళహస్తి టౌన్‌ బ్యాంకు అధ్యక్షుడిగా శెట్టిపల్లె సురేష్‌బాబు

శ్రీకాళహస్తి(చిత్తూరు): శ్రీకాళహస్తి టౌన్‌ బ్యాంకుకు కొత్త పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకు పాలకవర్గంలో అధ్యక్షుడు కాకుండా మరో 11మంది సభ్యులను కూడా నియమించారు. ఈ నామినేటెడ్‌ కమిటీ ఆరు నెలలు గానీ లేక ఆలోగా ఎన్నికలు జరిగేంత వరకూ కొనసాగనుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా గతంలో నియమించిన పాలకవర్గానికి జూన్‌ 2వ తేదీతో పదవీ కాలం ముగిసింది. అయితే కొత్త పాలకవర్గం బాధ్యతలు చేపట్లే వరకూ పాత పాలకవర్గం కొనసాగేవిధంగా వుత్తర్వుల్లో వివరించారు. బ్యాంకు కొత్త అధ్యక్షుడిగా శెట్టిపల్లె సురేష్‌బాబును, ఆర్కాడు శేఖర్‌ను ఉపాధ్యక్షుడిగా నియమించారు. మిగిలిన సభ్యులుగా జలకం రాజేంద్ర, పూడి రవికుమార్‌, సిద్దిరాజు మస్తానయ్య, టి.బ్రహ్మయ్య, చల్లా జయరామయ్య, వల్లం గోపయ్య, బచ్చు మధు, జి.గోపాల్‌ రెడ్డి, ఎస్‌కె. సాగీరాబీ, వి.జయశ్రీ నియమితులయ్యారు.   


Updated Date - 2020-07-28T16:11:55+05:30 IST