సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు
ABN , First Publish Date - 2020-12-30T05:27:21+05:30 IST
సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుపతి నుంచి పలు ప్రాంతాల మధ్య నడుస్తున్న కొన్ని రైళ్ల సమయాన్ని పొడిగిస్తూ.. మరో ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలును ఏర్పాటు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తిరుపతి(ఆటోనగర్), డిసెంబరు 29: సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుపతి నుంచి పలు ప్రాంతాల మధ్య నడుస్తున్న కొన్ని రైళ్ల సమయాన్ని పొడిగిస్తూ.. మరో ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలును ఏర్పాటు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి-లింగంపల్లె (02733-02734) ప్రత్యేక రైళ్లు.. నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ రాకపోకలు నిర్వహించే మార్గంలో జనవరి 21నుంచి మార్చి 31వరకు నడుస్తాయి.ఫ తిరుపతి-అమరావతి మధ్య ప్రత్యేకరైలు(02765) జనవరి 19నుంచి మార్చి 30తేదీ వరకు గురు, శనివారాల్లో మాత్రమే రాకపోకలు సాగిస్తుంది. ఫకాచిగూడ-చిత్తూరు మధ్య ప్రత్యేకరైలు (02797) జనవరి 8,9,10,11,12,16వరకు, ఫ చిత్తూరు-కాచిగూడ మధ్య ప్రత్యేక రైలు (02798)జనవరి 9,10,11,12,13,17వరకు రాకపోకలు నిర్వహిస్తుంది. ఈ రైళ్లు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ మార్గంలో నడుస్తుంది.