వీధి బాలలు కరోనా బారిన పడకుండా చూస్తాం

ABN , First Publish Date - 2020-07-15T10:11:23+05:30 IST

వీధి బాలలు కరోనా బారిన పడకుండా చూస్తామని ఎస్పీ సెంథిల్‌కుమార్‌ తెలిపారు. ఆపరేషన్‌ ముష్కాన్‌లో భాగంగా..

వీధి బాలలు కరోనా బారిన పడకుండా చూస్తాం

వారంపాటు ఆపరేషన్‌ ముష్కాన్‌

ఎస్పీ సెంథిల్‌కుమార్‌


చిత్తూరు/తిరుపతి (నేరవిభాగం), జూలై 14: వీధి బాలలు కరోనా బారిన పడకుండా చూస్తామని ఎస్పీ సెంథిల్‌కుమార్‌ తెలిపారు. ఆపరేషన్‌ ముష్కాన్‌లో భాగంగా.. మంగళవారం చిత్తూరు నాగయ్య కళాక్షేత్రం వద్ద పరిసర ప్రాంతాల్లో గుర్తించిన 15 మంది పిల్లలతో ఎస్పీ మాట్లాడారు. వారికి గ్లౌజులు, మాస్కులు, శానిటైజర్లు అందించారు. వారం పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. తొలి రోజు చిత్తూరులో 38 బాలురు, ఓ బాలిక, పలమనేరులో 42 బాలురు, ఏడుగురు బాలికలు, మదనపల్లెలో 18 బాలురు, పుత్తూరులో 17 మంది బాలురలతో కలిపి మొత్తం 115 మందిని గుర్తించినట్లు చెప్పారు. వీరందరికీ కొవిడ్‌ పరీక్షలు చేయిస్తామన్నారు.


ఆ తర్వాత వారి ఇష్టానుసారం తల్లిదండ్రుల వద్దకు లేదా షెల్టర్‌ హోంకు తరలిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి, అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ జగదీశ్‌బాబు, తదితరులు పాల్గొన్నారు. అలాగే తిరుపతిలోని వీధి బాలలకు శానిటైజర్లు, మాస్కులను ఈస్ట్‌, వెస్ట్‌, అలిపిరి, ఎస్వీయూ పోలీసులు అందజేశారు. ఈ సందర్భంగా నలుగురు బాలలు, ఇద్దరు బాలికలను తల్లిదండ్రులకు అప్పగించారు. ఈస్ట్‌ డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ శివప్రసాద్‌రెడ్డి, ఇతర సిబ్బంది, ఎస్వీయూ సీఐ రీంద్రనాథ్‌ తదితర సిబ్బంది పాల్గొన్నారు.  

Updated Date - 2020-07-15T10:11:23+05:30 IST