-
-
Home » Andhra Pradesh » Chittoor » Somali YCP leader registered as PD Act
-
సోమల వైసీపీ నాయకుడిపై పీడీ యాక్టు నమోదు
ABN , First Publish Date - 2020-03-13T11:13:52+05:30 IST
సోమల మండలానికి చెందిన వైసీపీ నాయకుడిపై పీడీ యాక్టు నమోదైంది. ఈ మేరకు కలెక్టరు పంపిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

కలికిరి/సోమల, మార్చి 12: సోమల మండలానికి చెందిన వైసీపీ నాయకుడిపై పీడీ యాక్టు నమోదైంది. ఈ మేరకు కలెక్టరు పంపిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సోమల మండలం అన్నెమ్మగారిపల్లె పంచాయతీ పేటూరుకు చెందిన పొంగుబాల శివప్రసాద్ (52) పైన ఈ పీడీ చట్టం కింద అభియోగాలు మోపారు. ప్రస్తుతం ఈయన తిరుపతి చంద్రశేఖర్ రెడ్డి కాలనీలో నివసిస్తున్నట్లు ఈ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఈయన తమ్ముడు సోమల మాజీ వైస్ ఎంపీపీ రామేశ్వర ప్రసాద్ హత్య కేసులో శివప్రసాద్ నిందితుడిగా వున్నాడు.