నీటి సంపులోకి దిగిన ఆరుగురికి అస్వస్థత

ABN , First Publish Date - 2020-03-13T11:29:13+05:30 IST

బంగారుపాళ్యం మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో నూతనంగా నిర్మించిన నీటి సంపులోకి దిగిన ఆరుగురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

నీటి సంపులోకి దిగిన ఆరుగురికి అస్వస్థత

బంగారుపాళ్యం, మార్చి 12: బంగారుపాళ్యం మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో నూతనంగా నిర్మించిన నీటి సంపులోకి దిగిన ఆరుగురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వివరాలిలా ఉన్నాయి. ఎస్సీ కాలనీకి చెందిన జోసెఫ్‌(45) మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు ఏర్పాటులో భాగంగా నీటిసంపు నిర్మించారు. గురువారం సెంట్రింగ్‌ ఊడదీయడానికి సంపులోపలికి సతీష్‌(30), జోసెఫ్‌(45)లు దిగారు. అయితే సంపులో క్యూరింగ్‌ కోసం నీరు పట్టగా నిలిచిపోయింది .


దానికి తోడు చెత్తాచెదారం పడి కుళ్ళిపోయాయి. దీంతో దిగిన ఇద్దరు విషవాయువు ప్రభావంతో కేకలు వేస్తూ అస్వస్థతకు గురయ్యారు. వారిని కాపాడడానికి లోపలికి దిగిన రమేష్‌ (45), సుధీర్‌కుమార్‌(25), అష్రఫ్‌(29), సందీప్‌ (23)వారు కూడా అస్వస్థతకు లోనయ్యారు. కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో గ్రామస్తులు పలువురు సంఘటనా స్థలానికి చేరుకుని, సంపును కొంత మేర పగలగొట్టి లోపల ఉన్నవారిని బయటకు తీసుకువచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.  ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వేలూరు సీఎంసీకి తరలించారు.

Updated Date - 2020-03-13T11:29:13+05:30 IST