సమ్మె విరమించిన పట్టురీలర్లు

ABN , First Publish Date - 2020-12-10T05:48:49+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా 14 రోజులుగా చేస్తున్న సమ్మెను బుధవారం విరమించినట్టు మదనపల్లె పట్టురీలర్ల అసోసియేషన్‌ నాయకులు తెలిపారు.

సమ్మె విరమించిన పట్టురీలర్లు
పట్టు రీలర్ల సమావేశంలో మాట్లాడుతున్న సెరికల్చర్‌ ఏడీ విజయరామిరెడ్డి

మదనపల్లె టౌన్‌, డిసెంబరు 9: రాష్ట్రవ్యాప్తంగా 14 రోజులుగా చేస్తున్న సమ్మెను  బుధవారం విరమించినట్టు మదనపల్లె పట్టురీలర్ల అసోసియేషన్‌ నాయకులు తెలిపారు. స్థానిక పట్టుగూళ్ల మార్కెట్‌లో జరిగిన సమావేశంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు డీవీ నాయుడు  మాట్లాడారు. ఇన్సెంటివ్‌ బకాయిలు చెల్లించాలని, ఏడీ ద్వారానే ఇన్సెంటివ్‌లు పంపిణీ చేయాలని, కేటగిరి-3 నుంచి కేటగిరి-4కు రీలింగ్‌ యూనిట్ల విద్యుత్‌ చార్జీలు వసూలు చేయాలని, తమకు కేటాయించిన రీలింగ్‌, ఇళ్ల స్థలాలకు ఎన్‌వోసీలు మంజూరు చేయాలన్న డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ మేరకు విజయవాడలో రాజంపేట, హిందూపురం ఎంపీలు మిథున్‌రెడ్డి, గోరంట్ల మాధవ్‌, హిందూపూర్‌ ఎమ్మెల్సీ ఇక్బాల్‌తో చర్చలు జరపగా..వారు హామీ ఇచ్చారన్నారు. దీంతో తాము సమ్మె విరమించి, పట్టుగూళ్ల కొనుగోలు ప్రారంభించామన్నారు. అనంతరం రీలర్లతో సెరికల్చర్‌ ఏడీ విజయరామిరెడ్డి సమావేశమై పలు సూచనలు ఇచ్చారు. సమావేశంలో పట్టుగూళ్ల మార్కెట్‌ అధికారి రవీంద్రనాథ్‌, రీలర్ల అసోసియేషన్‌ కార్యదర్శి రెడ్డి శేఖర్‌, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-10T05:48:49+05:30 IST