-
-
Home » Andhra Pradesh » Chittoor » shikarees arrest in midnight
-
అర్ధరాత్రి షికారీల అరెస్టు
ABN , First Publish Date - 2020-12-28T06:54:08+05:30 IST
ఏర్పేడు మండలం చింతలపాలెం మరాఠీపురంలోని షికారీలను పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అరెస్టు చేశారు.

శ్రీకాళహస్తి, డిసెంబరు27: ఏర్పేడు మండలం చింతలపాలెం మరాఠీపురంలోని షికారీలను పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. శ్రీకాళహస్తి మండలం ఊరందూరు వద్ద సోమవారం జరిగే సభకు సీఎం జగన్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని కలసి చిన్నబాబు (బాబ్లీ) హత్య కేసు, భూసమస్య గురించి వివరించాలని, అవసరమైతే నిరసన తెలపాలని షికారీలు నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా షికారీల నాయకుడు పరశురాంతో పాటు పలువురిని అరెస్టు చేశారు. కాగా, షికారీలను అర్ధరాత్రి అరెస్టు చేయడాన్ని సీసీఐ నేత చిన్న పెంచలయ్య ఖండించారు. ముఖ్యమంత్రిని కలవడానికి షికారీలకు అనుమతివ్వాలని ఆయన డిమాండ్ చేశారు.