ఒకేరోజు 559మందికి

ABN , First Publish Date - 2020-07-22T11:34:14+05:30 IST

ఒకేరోజు 559మందికి

ఒకేరోజు 559మందికి

తిరుపతిలోనే 314మందికి సోకిన కరోనా

కొవిడ్‌తో మరో ఏడుగురి మృతి


తిరుపతి, జూలై 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా కేసులు ఒక్కరోజులోనే 500దాటాయి. సోమవారం రాత్రి 9 గంటల నుంచీ మంగళవారం రాత్రి 9 గంటల వరకూ  559 కరోనా పాజిటివ్‌ కేసుల్ని జిల్లా యంత్రాంగం గుర్తించింది. వీటిలో అత్యధికంగా తిరుపతి నగరంలో 314 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో జిల్లాలో మొత్తం వైరస్‌ కేసుల సంఖ్య 5999కి చేరుకుంది. వీటిలో తిరుపతి నగరంలో 314, తిరుపతి రూరల్‌ మండలంలో 60, శ్రీకాళహస్తిలో 37, చిత్తూరు, నగరి, రేణిగుంట మండలాల్లో 15 చొప్పున, చంద్రగిరిలో 10, పుత్తూరులో 9, వరదయ్యపాళ్యం, ఏర్పేడు మండలాల్లో 8 చొప్పున, కలికిరిలో 5, పిచ్చా టూరు, సదుం, వడమాలపేట మండలాల్లో 4 చొప్పున, రామసముద్రం, చిన్నగొట్టిగల్లు, కార్వేటినగరం మండలాల్లో 3 చొప్పున, బీఎన్‌ కండ్రిగ, పీలేరు, చౌడేపల్లె, రొంపిచెర్ల, జీడీనెల్లూరు, రామచంద్రాపురం, విజయపురం మండలాల్లో 2 చొప్పున, కేవీపల్లె,గుడిపాల, కలకడ, నాగలాపురం, నారాయణవనం, పూతలపట్టు, సోమల, వాల్మీకిపురం, వెదురుకుప్పం,ఎర్రావారిపాళ్యం, తొట్టంబేడు, కేవీబీపురం, ములకలచెరువు, నిండ్ర, సత్యవేడు మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున వున్నాయి.


కాగా ఇతర జిల్లాలకు సంబంధించిన కేసులు 14 నమోదయ్యాయి.కాగా  మంగళవారం కొవిడ్‌ బారిన పడి ఏడుగురు మృతి చెందారు. వీరిలో తిరుపతికి చెందిన 60, 72 ఏళ్ళ వయసున్న పురుషులు, 70, 73 ఏళ్ళ వయసున్న మహిళలు, పాకాలకు చెందిన 74 ఏళ్ళ వృద్ధుడు, ఏర్పేడుకు చెందిన 65 ఏళ్ళ మహిళ, శ్రీకాళహస్తికి చెందిన 75 ఏళ్ళ వృద్ధుడు వున్నారు. ఈ మరణాలతో జిల్లాలో ఇప్పటి దాకా కరోనా సోకి మృతి చెందిన వారి సంఖ్య 66కు చేరుకుంది.

Updated Date - 2020-07-22T11:34:14+05:30 IST