శేషాపురంలో ‘గజ’దాడులు

ABN , First Publish Date - 2020-08-11T11:21:02+05:30 IST

చంద్రగిరి మండలం శేషాపురం, కందులవారిపల్లె అటవీ ప్రాంత సమీపంలోని పంట పొలాలపై సోమవారం తెల్లవారుజామున ఏనుగులు దాడులు చేశాయి.

శేషాపురంలో ‘గజ’దాడులు

చంద్రగిరి, ఆగస్టు 10: చంద్రగిరి మండలం శేషాపురం, కందులవారిపల్లె అటవీ ప్రాంత సమీపంలోని పంట పొలాలపై సోమవారం తెల్లవారుజామున ఏనుగులు దాడులు చేశాయి. సుమారు 8 ఏనుగులు కందులవారిపల్లె మీదుగా వస్తూ శేషాపురం వద్దవున్న పంట పొలాలను తొక్కేశాయి. వీటిని తరిమేందుకు గ్రామస్తులు ఇబ్బంది పడ్డారు. శేషాపురంలోని దూర్వాసుల నాయుడుకు చెందిన మూడు ఎకరాలు, నారాయణస్వామినాయుడుకు చెందిన రెండు ఎకరాల్లో వరి పంటను ధ్వంసం చేశాయి. ఈ పరిణామంతో కందులవారిపల్లె, శేషాపురం గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. దెబ్బతిన్న పంటలను అటవీశాఖ అధికారులు పరిశీలించారు. తమ పంటను ఏనుగులు ధ్వంసం చేయకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.  

Updated Date - 2020-08-11T11:21:02+05:30 IST