సర్వర్‌ డౌన్‌

ABN , First Publish Date - 2020-09-12T05:38:43+05:30 IST

సర్వర్‌ డౌన్‌

సర్వర్‌ డౌన్‌

  •  సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల చుట్టూ జనం ప్రదక్షిణ

చిత్తూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 11: రిజిస్ర్టేషన్‌ శాఖ మెయిన్‌ సర్వర్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యలు ప్రజలను తిప్పలు పెడుతున్నాయి. ఎప్పుడు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లినా సర్వర్‌డౌన్‌ అని సిబ్బంది చెబుతున్నారు. దీంతో డాక్యుమెంటేషన్‌, సేల్‌డీడ్‌, గిఫ్ట్‌డీడ్‌, సెటిల్‌మెంట్‌, ఈసీ తదితర సర్టిఫికెట్ల కోసం చలానాలు చెల్లించిన ప్రజలు నెలరోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. సర్వర్‌ సక్రమంగా పనిచేయకుంటే ఏం చేయాలని వారు సమాధానం ఇస్తున్నారు. చిత్తూరు సబ్‌రిజిస్ర్టార్‌ మౌలా మాట్లాడుతూ... మెయిన్‌ సర్వర్‌లో ఏర్పడిన సాంకేతికారణాలతోనే సమస్యలు వస్తున్నాయని చెప్పారు. బుధవారం 200 మందికి పలురకాల సర్టిఫికెట్లు ఇచ్చినట్లు గుర్తుచేశారు. గురువారం సర్వర్‌ డౌన్‌ అవడంతో జనం ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-12T05:38:43+05:30 IST