నామినేషన్లతోనే వెనక్కి పంపేశారు

ABN , First Publish Date - 2020-03-13T11:20:02+05:30 IST

అధికార పార్టీ నాయకులు అనుకున్నట్లుగానే చేశారు. అధికారాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు.

నామినేషన్లతోనే వెనక్కి పంపేశారు

టీడీపీ అభ్యర్థులకు తిరస్కరణ దెబ్బ

అధికారుల తీరుపై ప్రతిపక్ష నేతల ఆగ్రహం


తిరుపతి సిటీ, మార్చి 12: అధికార పార్టీ నాయకులు అనుకున్నట్లుగానే చేశారు. అధికారాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. నామినేషన్‌ పత్రాల్లో పెద్దగా తప్పులు లేక పోయినా... చిన్న చిన్న కారణాలతోనే వాటిని తిరస్కరించేలా చేశారు. ఫలితంగా జిల్లాలోని పలు మండలాల్లో నామినేషన్ల పరిశీలన ముగిసే సరికే తమ పార్టీ అభ్యర్థులను ఏకగ్రీవం చేసుకున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో ఈ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనూ చిన్న కారణాలతోనే నామినేషన్లు తిరస్కరించడంతో నాలుగు మండలాలు వైసీపీ ఖాతాలోకి వెళ్లనున్నాయి. ఈ పరిణామాలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతల ఒత్తిడికి తలొగ్గి అధికారులు ఇలా చేశారని ఆరోపిస్తున్నారు. 


జిల్లాలో 901 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ప్రస్తుతం 858 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ బుధవారం ముగిసింది. ఇందులో టీడీపీ వారు 1,653, వైసీపీ 2,076, బీఎస్పీ 20, బీజేపీ 131, సీపీఐ 11, సీపీఎం 10, కాంగ్రెస్‌ 26, జనసేన 66, ఇతర పార్టీల వారు 150, స్వతంత్రులు 117 మంది నామినేషన్లు దాఖలు చేశారు. గురువారం నామినేషన్ల పరిశీలన చేశారు. పరిశీలనలో  అధికారపార్టీ తప్ప.. మిగిలిన పార్టీల వారు దాఖలుచేసిన నామినేషన్లను పెద్ద సంఖ్యలో తిరస్కరించారు. వీటిని నియోజక వర్గాల వారీగా పరిశీలిస్తే.. 


సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని సత్యవేడు, పిచ్చాటూరు, నాగలాపురం  మండలాల్లో నామినేషన్లు తిరస్కరణకు గురికాలేదు. నారాయణవనంలో నాలుగు తిరస్కరణకు గురయ్యాయి. ఇందులో టీడీపీ 1, ఇతరులు 3 ఉన్నాయి. కేవీబీపురం మండలంలో తిరస్కరించిన ఆరు నామినేషన్లలో టీడీపీ 3, వైసీపీ 2, బీజేపీ 1 ఉన్నాయి. బీఎన్‌కండ్రిగలో టీడీపీ 1, వైసీపీ 1 చొప్పున.. వరదయ్యపాళెంలో టీడీపీ 3, వైసీపీ 1, ఇతరులు 1 చొప్పున నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 


నగరి నియోజకవర్గ పరిఽధిలో నగరి మండలంలో టీడీపీ 1, ఇతరులు 1 చొప్పున రెండు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. పుత్తూరులో వైసీపీకి చెందిన ఒకటి.. వడమాలపేటలో టీడీపీ 1, వైసీపీ 1, ఇతరులు 1.. నిండ్రలో టీడీపీవి రెండు.. విజయపురంలో వైసీపీ 3, ఇతరులు ఒకటి చొప్పున నామినేషన్లు తిరస్కరించారు. 


పలమనేరు నియోజకవర్గ పరిధిలోని పలమనేరులో 13, బైరెడ్డిపల్లెలో 2, గంగవరంలో 3, పెద్దపంజాణిలో 9, వి.కోటలో 5 వంతున నామినేషన్లు తిరస్కరించారు. 


 మదనపల్లె నియోజకవర్గ పరధిలోని మదనపల్లె మండలంలో టీడీపీ 3, వైసీపీ 1, స్వతంత్ర అభ్యర్థి 1.. నిమ్మనపల్లె మండలంలో టీడీపీ 1.. రామసముద్రం మండలంలో టీడీపీ 1 చొప్పున నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 


కుప్పం నియోజకవర్గ పరిధిలో గుడపల్లెలో 4, శాంతిపురంలో 2, రామకుప్పంలో 3 నామినేషన్లను  సాంకేతిక కారణాలతో అధికారులు తిరస్కరించారు. ఇక కుప్పం మండలంలో టీడీపీ 3, వైసీపీ 2, జనసేన 1, స్వతంత్ర అభ్యర్థి ఒకరు చొపుపన నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.  


పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని పుంగనూరు మండలంలో 35, చౌడేపల్లెలో 6, సోమలలో 16, పులిచెర్లలో 1 నామినేషన్‌ను తిరస్కరించారు. సదుంలో ఏ ఒక్క నామినేషన్‌ తిరస్కరణకు గురి కాలేదు. రొంపిచర్ల మండలంలో నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయో లేదో అధికారులు వెల్లడించలేదు. వివరాలకు ప్రయత్నించగా సంబంధిత అధికారులు అందుబాటులోకి రాలేదు. 


గంగాధరనెల్లూరు నియోజకవర్గ పరిధిలోని కార్వేటి నగరం మండలంలో టీడీపీ 1.. శ్రీరంగరాజపురంలో టీడీపీ 3, వైసీపీ 2.. వెదురుకుప్పంలో టీడీపీ 1, ఇతరులు 3 చొప్పున నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. పెనుమూరు, పాలసముద్రం మండలాల్లో ఒక్కటీ తిరస్కరణకు గురికాలేదు. 


 పూతలపట్టు నియోజకవర్గంలోని పూతలపట్టు మండలంలో టీడీపీ 3, వైసీపీ 1, స్వతంత్రులు ఒకటి.. యాదమరిలో స్వతంత్ర అభ్యర్థి 1, తవణంపల్లెలో  టీడీపీ 4, వైసీపీ 3, బీఎస్పీ 1, బంగారుపాళెంలో టీడీపీ 1, ఐరాలలో బీజేపీ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించారు. 


శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని శ్రీకాళహస్తి మండలంలో 62 నామినేషన్లు తిరస్కరించారు. వీటిలో టీడీపీ 34, వైసీపీ 10, బీజేపీ 9, జనసేన 2, కాంగ్రెస్‌ 3, ఇతరులు 4 ఉన్నాయి. తొట్టంబేడు మండలంలో 44 నామినేషన్లు తిరస్కరించారు. ఇందులో టీడీపీ 23, వైసీపీ 8, బీజేపీ 9, జనసేన 1, కాంగ్రెస్‌ 2, ఇతరులు 1 వంతున ఉన్నాయి. ఏర్పేడు మండలంలో 77 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇందులో టీడీపీ 31, వైసీపీ 37, సీపీఎం 1, జనసేన 3, కాంగ్రెస్‌ 2, ఇతరులు 3 ఉన్నాయి. ఈ మండలంలో 16 స్థానాలు ఉండగా... 13 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో రెండు కూడా ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. కేవలం ఒక స్థానంలో మాత్రమే ఎన్నిక జరగనుంది. రేణిగుంటలో టీడీపీ 21, వైసీపీ 9, బీజేపీ 2, సీపీఐ 2, ఇతరులు 5 చొప్పున నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 


చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని చంద్రగిరిలో రెండు, చిన్నగొట్టిగల్లులో 10, యర్రావారిపాళెంలో ఒకటి, పాకాలలో 28, రామచంద్రాపురంలో ఐదు, తిరుపతి రూరల్‌లో 72 నామినేషన్లు తిరస్కరించారు.


తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలోని తంబళ్లపల్లెలో 33 నామినేషన్లు  తిరస్కరించారు. పెద్దమండ్యంలో తిరస్కరించిన 10 నామినేషన్లలో టీడీపీ 3 ఉన్నాయి. కురబలకోటలో 32 నామినేషన్లు తిరస్కరించగా ఇందులో టీడీపీ 21, వైసీపీ 6, బీజేపీ 1, ఇతరులు నాలుగు వంతున ఉన్నాయి. ములకలచెరువులో తిరస్కరించిన 51 నామినేషన్లు తిరస్కరించారు. బి.కొత్తకోటలో తిరస్కరించిన 14 నామినేషన్లలో టీడీపీ 9, జనసేన 1, బీజేపీ 1, ఇతరులు మూడు ఉన్నాయి. పీటీఎంలో 17 నామినేషన్లను తిరస్కరించారు. చిత్తూరు నియోజకవర్గ పరధిలోని చిత్తూరు, గుడిపాల మండలాల పరిధిలో ఏ ఒక్క నామినేషన్‌ కూడా తిరస్కరణకు గురి కాలేదు. 

Updated Date - 2020-03-13T11:20:02+05:30 IST