స్వీయ నిర్బంధం పాటించకపోతే పెను ప్రమాదం : ఎంపీ రెడ్డెప్ప

ABN , First Publish Date - 2020-03-28T09:45:12+05:30 IST

ఇటీవల కర్ణాటక రాష్ట్రం నుంచి పుంగనూరు మండలంలోని పలు గ్రామాలకు వచ్చిన ఉద్యోగులు, కార్మికులు, వ్యక్తిగత స్వీయ నిర్బంధం...

స్వీయ నిర్బంధం పాటించకపోతే పెను ప్రమాదం : ఎంపీ రెడ్డెప్ప

పుంగనూరు, మార్చి 27: ఇటీవల కర్ణాటక రాష్ట్రం నుంచి పుంగనూరు మండలంలోని పలు గ్రామాలకు వచ్చిన ఉద్యోగులు, కార్మికులు, వ్యక్తిగత స్వీయ నిర్బంధం పాటించకపోతే పెను ప్రమాదం తప్పదని చిత్తూరు ఎంపీ ఎన్‌.రెడ్డెప్ప హెచ్చరించారు. కర్ణాటక ప్రాంతం నుంచి వందలాది మంది సమాచారం లేకుండా గ్రామాలకు వచ్చారని తెలుసుకున్న ఎంపీ శుక్రవారం మండల స్థాయి అధికారులు, వైసీపీ నాయకులతో కలసి పలు గ్రామాల్లో పర్యటించారు. కురవూరు, కురప్పల్లె, జోకొత్తూరు గ్రామాల్లో ప్రజలకు  కరోనా వైర్‌సపై అవగాహన కల్పించి బయట తిరగవద్దని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితం గ్రామాలకు వచ్చిన వలస కుటుంబాలు గ్రామమంతా తిరగడం, అందరినీ కలవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. 15 రోజులపాటు గ్రామాల్లోకి ఎవరినీ రానివ్వొద్దని, అలాగే గ్రామస్తులు బయట ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించారు.


ఇష్టమొచ్చినట్లు ప్రవరిస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. పొద్దుపోలేదని గ్రామాల్లో సమూహంగా వివిధ ఆటలు ఆడటం మంచిదికాదన్నారు. ప్రజలంతా గృహ నిర్బంధంలో ఉంటూ సామాజిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు, సీఐ గంగిరెడ్డి,  తహసీల్దారు వెంకట్రాయలు, వైద్యాధికారి డాక్టరు రాజశేఖర్‌, వైసీపీ నాయకులు ఎ.భాస్కర్‌రెడ్డి, ఎమ్‌.రెడ్డెప్ప, చంద్రారెడ్డియాదవ్‌, వెంకటరెడ్డియాదవ్‌,  పాల్గొన్నారు. 


Updated Date - 2020-03-28T09:45:12+05:30 IST