-
-
Home » Andhra Pradesh » Chittoor » SEBI
-
ఎస్‌ఈబీకి 30 మంది సీఐలు
ABN , First Publish Date - 2020-05-18T11:18:03+05:30 IST
రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమాల నియంత్రణకు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో

37 మంది ఎస్‌ఐలు, 77 మంది హెడ్‌కానిస్టేబుళ్లు కూడా
ఎక్సైజ్ శాఖకు మిగిలింది 10 మంది సీఐలు, 15 మంది ఎస్‌ఐలు, 32 మంది హెడ్‌కానిస్టేబుళ్లు
కలికిరి, మే 17: రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమాల నియంత్రణకు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ)కు జిల్లాలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ నుంచి 30 మంది సీఐలను బదలాయించారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే చిత్తూరు ఎస్‌ఈబీ అదనపు ఎస్పీగా ఐపీఎస్ అధికారి వై.రిషాంత్‌రెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఎస్‌ఈబీని బలోపేతం చేసేందుకు ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖలోని అధికారులను, సిబ్బందిని దీని పరిధిలోకి తీసుకొచ్చారు.
తొలివిడత 30 మంది సీఐలను కేటాయించారు. డిస్టిల్లరీలు, ప్రభుత్వ మద్యం షాపుల పర్యవేక్షణకు మాతృ సంస్థలోనే పది మందిని ఉంచారు. అలాగే, 37 మంది ఎస్‌ఐలతోపాటు 77 మంది హెడ్‌కానిస్టేబుళ్లను ఎస్‌ఈబీకి కేటాయించారు. ఇక మాతృశాఖ అయిన ప్రొహిబిషన్, ఎక్సైజ్‌కు పది మంది సీఐలు, 15 మంది ఎస్‌ఐలు, 32 మంది హెడ్‌కానిస్టేబుళ్లు మాత్రం మిగిలారు. ప్రస్తుతం ప్రొహిబిషన్, ఎక్సైజ్.. ఎస్‌ఈబీ మధ్య కేటాయింపులు పూర్తయ్యాక, ఎస్‌ఈబీలో ప్రస్తుతం పనిచేస్తున్న కేంద్రాల నుంచి బదిలీలు కూడా జరిగే అవకాశముందని చెబుతున్నారు. ఇసుక అక్రమ రవాణా, మద్యం మాఫియా ప్రభావిత ప్రాంతాలను గుర్తించిన అనంతరం సమర్థత ఆధారంగా వీరందరికీ పోస్టింగు ఇవ్వనున్నారని సమాచారం.
ఎస్‌ఈబీకి బదిలీ అయిన సీఐలు
ఎం.కన్నయ్య, బి.మురళీమోహన్ (ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, చిత్తూరు), ఎ.పురుషోత్తం (చిత్తూరు అర్బన్), ఐ.లావణ్య (చిత్తూరు రూరల్) ఎం. మురళీకిషోర్ (కార్వేటినగరం), కేవీఎస్ ఫణీంద్ర (మదనపల్లె), పి.టి.శ్రీనివాస రెడ్డి(పుంగనూరు), ఒ.శ్రీధర్ (పలమనేరు), జి.చంద్రశేఖర్ నాయుడు (కుప్పం), వి.ఎల్లయ్య (వాల్మీకిపురం), వై.గురుప్రసాద్(పీలేరు), ఎం.మల్లిక, ఎన్.బాబూప్రసాద్ (చీకిలిబైలు చెక్‌పోస్టు), డి.విశ్వేశ్వరరావు ఎం.చంద్రశేఖర్ నాయుడు (క్యాటిల్ ఫాం చెక్‌పోస్టు), సి.ఎస్.కస్తూరి, జి.తిరుమలయ్య (నరహరిపేట చెక్‌పోస్టు), కె.లీలారాణి బి.శ్రీరాములు (రామసముద్రం చెక్‌పోస్టు), వై.హేమంత్‌కుమార్, ఎస్.జె.మురళీమోహన్ (వి.కోట చెక్‌పోస్టు), పాలకిషోర్‌కుమార్ (బోర్డర్ పెట్రోలింగ్ పార్టీ, పలమనేరు), జవహర్ బాబు (బోర్డర్ పెట్రోలింగ్ పార్టీ, మదనపల్లె), జి.ప్రశాంత విజయకుమార్ (బోర్డర్ పెట్రోలింగ్ పార్టీ, నగరి), ఎస్.ధీరజ్ రెడ్డి (తిరుపతి అర్బన్), కొత్తకోట మోహన్ (పుత్తూరు), ఎం.రామచంద్ర(సత్యవేడు), పి. శ్రీహరి (శ్రీకాళహస్తి), కె.శివరావ్(పాకాల), సి.నాగరాజ రెడ్డి (తిరుపతి రూరల్).
ఎక్సైజ్‌లోనే కొనసాగే సీఐలు
వి.అమృత లక్ష్మి (డిస్టిల్లరీస్, తిరుపతి), బి.ఇందిర (శ్రీనివాస డిస్టల్లరీస్, చిత్తూరు), ఎస్.తిరుపతయ్య (తిరుపతి), ఎస్.నీరజ (ఎన్‌ఫోర్స్‌మెంట్, తిరుపతి), పి.నాగరాజు (ఈఎస్ టాస్క్‌ఫోర్స్, చిత్తూరు), ఎస్.శ్రీనివాస రావు (ములకలచెరువు),డి.వాసుదేవచౌదరి (బోర్డర్ పెట్రోలింగ్ పార్టీ, మదనపల్లె), కె.సత్యనారాయణ (ఎన్‌ఫోర్స్‌మెంట్, చిత్తూరు), గౌరి మాలిశెట్టి(ఈఎస్ టాస్క్‌ఫోర్స్, తిరుపతి), కె.లక్ష్మణరావు (బోర్డర్ పెట్రోలింగ్ పార్టీ,పలమనేరు).