తెగిపోయిన గర్నిమిట్ట చెరువు

ABN , First Publish Date - 2020-11-27T07:04:32+05:30 IST

గర్నిమిట్ట సమీపంలో గురువా రం రాత్రి 11గంటల ప్రాంతంలో చెరువు కట్టతెగి కారు కొట్టుకుపోయింది.

తెగిపోయిన గర్నిమిట్ట చెరువు
శ్రీకాళహస్తి వాసులతో ఎస్‌ఐ రామ్మోహన్‌

 ప్రవాహంలో కొట్టుకుపోయిన కారు

 ముగ్గురిని కాపాడిన పోలీసులు


కేవీ పల్లె, నవంబరు 26: గర్నిమిట్ట సమీపంలో గురువా రం రాత్రి 11గంటల ప్రాంతంలో చెరువు కట్టతెగి  కారు కొట్టుకుపోయింది. దీన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. ఆ కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు వాగులో చిక్కుకున్నారు. హుటాహుటిన సిబ్బంది తో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ రామ్మోహన్‌.. తాళ్ల సాయంతో ఆ ముగ్గురు వ్యక్తులను ప్రాణాలతో కాపాడగలిగారు. శ్రీకాళహస్తికి చెందిన ఏకాంబరం, ఆయన కుమారుడు మోహన్‌, డ్రైవర్‌ అరుణ్‌ కారులో రాయచోటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో సుండుపల్లి మీదుగా పీలేరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ ముగ్గురు వ్యక్తులూ తమకు ప్రాణభిక్ష పెట్టారని ఎస్‌ఐకి కృతజ్ఞతలు తెలిపారు.

Read more