-
-
Home » Andhra Pradesh » Chittoor » Roja at tirumala
-
త్వరలోనే వెయ్యికాళ్ల మండపం పునర్నిర్మాణం : రోజా
ABN , First Publish Date - 2020-11-21T07:56:21+05:30 IST
తిరుమలలో వెయ్యికాళ్ల మండపం పునర్నిర్మాణం కోసం ప్రాసెస్ జరుగుతోందని ఏపీఐఐసీ చైర్‌పర్సన్ రోజా చెప్పారు.

తిరుమల, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో వెయ్యికాళ్ల మండపం పునర్నిర్మాణం కోసం ప్రాసెస్ జరుగుతోందని ఏపీఐఐసీ చైర్‌పర్సన్ రోజా చెప్పారు.టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి మండపానికి సంబంధించిన అన్ని విషయాల్లో అవగాహన ఉందని, త్వరలోనే నిర్మాణం ప్రారంభిస్తారన్నారు. శుక్రవారం కుటుంబ సమేతంగా తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆమె ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు.గతంలో కరోనాను కుంటిసాకుగా చూపి స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసిన పెద్దమనుషులు ఇప్పుడు వెంటనే జరిపించాలని ఆరాటపడుతున్నారంటూ విమర్శించారు.