దోపిడీ చేసిన లారీ బోల్తా: దొంగల పరారీ
ABN , First Publish Date - 2020-09-14T09:56:03+05:30 IST
ఆర్టీవో అధికారులమంటూ దుండగులు బెదిరించి టమోటా లారీని దొంగతనంగా తీసుకెళ్తుండగా.. ఆ వాహనం అదుపుతప్పి బోల్తా ..
పుంగనూరు రూరల్, సెప్టెంబరు 13: ఆర్టీవో అధికారులమంటూ దుండగులు బెదిరించి టమోటా లారీని దొంగతనంగా తీసుకెళ్తుండగా.. ఆ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. దొంగలు వాహనాన్ని వదిలి పారిపోయారు. రొంపిచెర్ల మండలానికి చెందిన వేణుగోపాల్ ఆదివారం తన లారీలో పుంగనూరు నుంచి టమోటాలోడుతో చెన్నైలోని కోయంబేడుకు బయలుదేరాడు. పలమనేరు రోడ్డులోని రిలయన్స్ పెట్రోలుబంక్ వద్ద ముగ్గురు దుండగులు ఆర్టీవో అధికారులమంటూ లారీని నిలిపారు. తర్వాత కత్తులు చూపి బెదిరించి లారీని ఏ.కొత్తకోట వైపు తీసుకెళ్లారు. ఈ విషయమై వేణుగోపాల్ పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు అప్రమత్తం అయ్యేలోగానే టమోటాల లోడు లారీ బోల్తాపడినట్లు సమాచారం అందింది. దొంగలు ప్రమాదం జరిగిన వెంటనే పరారయ్యారు. సీఐ గంగిరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.