పోటు వర్కర్ల ఇంట్లో చోరీ

ABN , First Publish Date - 2020-12-28T05:17:31+05:30 IST

తిరుచానూరు తారకరామకాలనీ (శివాలయంవీధి)కి చెందిన అన్నదమ్ములు ప్రశాంత్‌, సంతోష్‌కుమార్‌ శ్రీవారి ఆలయ పోటులో వర్కర్లుగా పనిచేస్తున్నారు. సంతోష్‌కుమార్‌కు ఈనెల 18న వివాహమైంది. వారం కిందట గుంటూరులోని అత్తగారింటికి తల్లి, భార్యతో కలిసి వెళ్లారు. సోదరుడు ప్రశాంత్‌ కూడా కుటుంబంతో కలిసి రెండ్రోజుల కిందట తిరుపతిలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. దీన్ని అదనుగా భావించిన దొంగలు వారింటి తలుపు గడియ విరగ్గొట్టి లోనికి ప్రవేశించారు. రెండు బెడ్‌రూమ్‌ల్లోని బీరువాలకే తాళాలు ఉండటంతో 128 గ్రాముల బంగారు ఆభరణాలు, అర కిలో వరకు వెండి వస్తువులు, లక్షన్నర నగదు ఎత్తుకెళ్లారు.

పోటు వర్కర్ల ఇంట్లో చోరీ
ఇంట్లో చిందర వందరగా ఉన్న వస్తువులు

128 గ్రాముల బంగారం, 

అర కిలో వెండి, రూ.లక్షన్నర అపహరణ


తిరుచానూరు, డిసెంబరు 27: తిరుచానూరు తారకరామకాలనీ (శివాలయంవీధి)కి చెందిన అన్నదమ్ములు ప్రశాంత్‌, సంతోష్‌కుమార్‌ శ్రీవారి ఆలయ పోటులో వర్కర్లుగా పనిచేస్తున్నారు. సంతోష్‌కుమార్‌కు ఈనెల 18న వివాహమైంది. వారం కిందట గుంటూరులోని అత్తగారింటికి తల్లి, భార్యతో కలిసి వెళ్లారు. సోదరుడు ప్రశాంత్‌ కూడా కుటుంబంతో కలిసి రెండ్రోజుల కిందట తిరుపతిలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. దీన్ని అదనుగా భావించిన దొంగలు వారింటి తలుపు గడియ విరగ్గొట్టి లోనికి ప్రవేశించారు. రెండు బెడ్‌రూమ్‌ల్లోని బీరువాలకే తాళాలు ఉండటంతో 128 గ్రాముల బంగారు ఆభరణాలు, అర కిలో వరకు వెండి వస్తువులు, లక్షన్నర నగదు ఎత్తుకెళ్లారు. ఆదివారం గుంటూరు నుంచి సంతోష్‌కుమార్‌ ఇంటికి రాగా తలుపు గడియ విరగ్గొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని.. క్లూస్‌టీమ్‌, డాగ్‌స్క్వాడ్‌ రప్పించి, ఆధారాలు సేకరించారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఐ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇలా ఊర్లకు వెళ్లేవారు తప్పనిసరిగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. 

Updated Date - 2020-12-28T05:17:31+05:30 IST